Share News

పట్టభద్రుల ఓటు కోసం..12.69 లక్షల మంది దరఖాస్తు

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:43 AM

తెలంగాణలో పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా అధిక సంఖ్యలో ఫారం-18 దరఖాస్తులు అందుతున్నాయి.

పట్టభద్రుల ఓటు కోసం..12.69 లక్షల మంది దరఖాస్తు

  • 11.86 లక్షల దరఖాస్తులకు ఆమోదం

  • 76029దరఖాస్తుల తిరస్కరణ..

  • పెండింగ్‌లో 7677ఫారాలు

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా అధిక సంఖ్యలో ఫారం-18 దరఖాస్తులు అందుతున్నాయి. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో ఓటరుగా నమోదు కోసం మొత్తం 12,69,926 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల విభాగాలు ఆదివారం వెల్లడించిన సమాచారం ప్రకారం... రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 11,86,220 దరఖాస్తులను ఆమోదించగా.. 76,029 దరఖాస్తులను తిరస్కరించారు.


మరో 7,677 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టభద్రుల ఓటు నమోదు కోసం అర్హుల నుంచి స్పందన పెరుగుతోంది. దీంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలను నిర్థారించడం, పెండింగ్‌లో ఉన్నవాటిని సత్వరం పరిష్కరించడంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. తిరస్కరణకు గురైన వాటికి సంబంధించి అదనపు ధ్రువీకరణలు సేకరించడం, తుది జాబితాలో చోటు కల్పించకపోవడం వంటి ప్రక్రియలు కొనసాగుతోన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 05:43 AM