ఎమ్మెల్సీ రేసులో పార్టీల దూకుడు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:31 AM
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేది మార్చి నెలలో అయినా.. ప్రధాన పార్టీల రేస్ మాత్రం ఇప్పటికే మొదలైంది. పట్టభద్రుల ఓట్ల నమోదు నుంచే పార్టీలు పోటీ పడుతున్నాయి.
ఓటరు నమోదులో ఎవరి వ్యూహాలు వారివి
అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా.. హైదరాబాద్ నుంచి కాసాని వీరేశ్, నల్లగొండ నుంచి రాకేశ్‌రెడ్డి..
అధికారిక ప్రకటన లాంఛనమే
హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాంచందర్‌రావుకు చాన్స్
హైదరాబాద్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేది మార్చి నెలలో అయినా.. ప్రధాన పార్టీల రేస్ మాత్రం ఇప్పటికే మొదలైంది. పట్టభద్రుల ఓట్ల నమోదు నుంచే పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే రెండు సీట్లకూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసిన అధికార కాంగ్రెస్ ఓటర్ల నమోదులోనూ దూకుడుగా ఉంది. బీఆర్‌ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకున్నా.. ఆ పార్టీల యం త్రాంగాలు మాత్రం ఓటరు నమోదులో చురుగ్గానే వ్యవహరిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి రాకేశ్ రెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి కాసాని వీరేశ్‌ల పేర్లు ఖరారయ్యాయి.
వీరి పేర్లు అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఇక హైదరాబాద్ సీటుకు బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరును ప్రకటించడం లాంఛనమేనని చెబుతున్నారు. ఆరు ఉమ్మడి జిల్లాలు.. 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వీటిలో హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం.. బీఆర్‌ఎస్ సిటింగ్ సీటు. నల్లగొండ.. కాంగ్రెస్ సిటింగ్ సీటు. ఆ రెండు పార్టీలకూ సిటింగ్ సీట్లను నిలబెట్టుకోవడం సవాల్‌గా మారింది. ముఖ్యంగా పాలన తీరుకు పట్టభద్రుల ఎన్నికలు లిట్మస్ టెస్టుగా మారడంతో అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రత్యామ్నాయ పార్టీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీఆర్‌ఎస్, ప్రత్యామ్నాయ రేసులో కొనసాగడానికి బీజేపీ.. ఈ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం షురూ..
అధికార కాంగ్రెస్.. తన శైలికి భిన్నంగా నల్లగొండ పట్టభద్రుల స్థానానికి సర్వోత్తమ్‌రెడ్డిని, హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి సామా రామ్మోహన్ రెడ్డిని అభ్యర్థులుగా ఇప్పటికే ప్రకటించేసింది. దీంతో వారు తమ ప్రచారాన్ని ప్రారంభించేశారు. పార్టీ క్షేత్రస్థాయి నాయకులే కాకుండా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలూ పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు చేయిస్తున్నారు. ఇక పార్టీ అభ్యర్థుల టీమ్ ఈ విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఉదాహరణకు హైదరాబాద్ పట్టభద్రుల సీటు కాంగ్రెస్ అభ్యర్థి అయిన సామా రామ్మోహన్ టీమ్‌ను ఆన్‌లైన్లో ఓటు నమోదుకు ఏ పట్టభద్రుడైనా సాయం కోరితే.. సదరు అభ్యర్థికి వాట్సాప్ లింక్‌ను పంపిస్తోంది. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి పంపితే ప్రక్రియను పూర్తి చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ పంపిస్తోంది.
వారిద్దరూ..
నల్లగొండ పట్టభద్రుల స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి పేరు ఖరారు కావడంతో ఓట రు నమోదుపైన ఆయన పూర్తిగా దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్.. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. ఈ సీటును తిరిగి దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 5.05 లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కును పొందారు. ఇప్పటికే 4.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటా పోటీగా ఓట్లు నమోదు చేయిస్తున్న నేపథ్యంలో గతం కంటే ఓటర్ల సంఖ్య పెరిగే ఆస్కారం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కాసాని వీరేశ్ పేరు ఖరారు కావడంతో ఆయన కూడా పార్టీ మద్దతుదారుల ఓట్లను నమోదు చేయించే పనిలో పడ్డారు. నల్లగొండ పట్టభద్రుల స్థానంలో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడం, యంత్రాంగమూ లేక పోవడం, ఆ పార్టీ అక్కడి నుంచి పోటీ చేస్తుందా.. లేక జనసేన అభ్యర్థికి మద్దతిస్తుందా? అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఆ పార్టీ తరఫున ఓట్ల నమోదు కార్యక్రమం అంత చురుగ్గా సాగట్లేదంటున్నారు. అయితే హైదరాబాద్ పట్టభద్రుల స్థానంపై మాత్రం బీజేపీ ఆశలు పెట్టుకుంది.
హైదరాబాద్‌లో మందకొడిగా..
నల్లగొండతో పోలిస్తే హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో ఓట్ల నమోదు కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఈ స్థానం లో 5.31 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఈసారి ఇప్పటికి 3.68 లక్షల మంది పట్టభద్రులు మాత్ర మే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు 6 కల్లా దరఖాస్తుదారుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకోవడం అసాధ్యమేనని అంచనా. పట్టభద్రుల ఓట్ల నమోదుపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెడుతుండగా.. న్యూట్రల్ పట్టభద్రులు ఓటు నమోదుకు అంత ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated Date - Nov 02 , 2026 | 05:24 AM