ఉద్యోగుల సామూహిక సెలవు నిర్ణయంపై తెలంగాణ సర్కార్ సీరియస్
ABN , Publish Date - Nov 16 , 2026 | 09:23 PM
ఉద్యోగుల సామూహిక సెలవు నిర్ణయంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రేపు (మంగళవారం) సామూహిక సెలవులో పాల్గొనే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
హైదరాబాద్, నవంబర్ 16: ఉద్యోగుల సామూహిక సెలవు నిర్ణయంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రేపు (మంగళవారం) సామూహిక సెలవులో పాల్గొనే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కాగా.. CPS రద్దు చేసి OPS విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఉద్యోగసంఘాలు రేపు సామూహిక సెలవును ప్రకటించాయి.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్(OPS) విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగసంఘాలు రేపు సామూహిక సెలవును ప్రకటించాయి. ఈ సెలవులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ మేరకు చాలా మంది ఉద్యోగులు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధులకు హాజరు కాని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. CCA నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్