వర్సిటీల్లో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:02 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు, వివాదాలపై విశ్వవిద్యాలయాల కులపతి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివాదాలపై బాలకిష్టారెడ్డిని ప్రశ్నించిన గవర్నర్
హైదరాబాద్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు, వివాదాలపై విశ్వవిద్యాలయాల కులపతి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డిని ఆయన లోక్ భవన్‌కు పిలిపించి మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఓయూలో 20రోజులుగా జరుగుతున్న బోధనేతర సిబ్బంది సమ్మె, జెఎన్‌టియులో సెక్యూరిటీ సిబ్బంది నియామకం టెండర్ల అవకతవకలు, వ్యవసాయ వర్సిటీ వీసీ జానయ్యపై వచ్చిన ఆరోపణలపై గవర్నర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
వీసీలతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా గవర్నర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యారంగంలో అమలవుతున్న పలు అంశాలను బాలకిష్టారెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీల్లో బ్యాక్‌లాగ్, రెగ్యులర్ అధ్యాపక నియామకాలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఖాళీల గుర్తింపు, రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. విద్యాసంస్థల్లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో క్యాంపస్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర వైద్య సదుపాయాలు, సురక్షిత తరలింపు, సంస్థల బాధ్యతలను నిర్దేశించే ‘తెలంగాణ ఈవెంట్స్ ఫెసిలిటేషన్ అండ్ సేఫ్టీ బిల్లు--2026’ ప్రతిపాదనను టీజీసీహెచ్‌ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News