Share News

3,000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:01 AM

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది.

3,000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
Telangana Government Loan

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 8.17 శాతం వార్షిక వడ్డీ, 20 ఏళ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్లు, 8.15 శాతం వార్షిక వడ్డీ, 26 ఏళ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తీసుకున్నది. రాష్ట్రంతో కలిపి దేశంలోని 12 రాష్ట్రాలు మొత్తం రూ.27,805 కోట్ల అప్పులు తీసుకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:01 AM