Share News

ఉద్యోగుల సామూహిక సెలవుపై సర్కారు సీరియస్‌!

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:29 AM

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం సామూహిక సెలవు పెట్టాలన్న ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయంపై సర్కారు సీరియస్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉద్యోగుల సామూహిక సెలవుపై సర్కారు సీరియస్‌!
Telangana Employees Mass Leave

  • కఠిన చర్యలు తీసుకోనుందంటూ వార్తలు

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం సామూహిక సెలవు పెట్టాలన్న ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయంపై సర్కారు సీరియస్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సామూహిక సెలవులో పాల్గొనే ఉద్యోగులపై సీసీఏ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అవసరమైతే సస్పెండ్‌ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.


అయితే ఈ ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించలేదు. కాగా, సర్కారు సీరియస్‌గా ఉందన్న వార్తలపై టీఎస్‌సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విచారం వ్యక్తం చేశారు. తమది కనీస హక్కులు, న్యాయమైన డిమాండ్‌ సాధన కోసం చేస్తున్న శాంతియుత ప్రయత్నమేనని ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 07:01 AM