జర్మనీకి నిపుణులైన మానవ వనరులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:34 AM
తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు.. జర్మనీకి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
ఉపాధి కల్పనపై భాగస్వామ్య ఏర్పాటు
యువతకు ప్రాక్టికల్ శిక్షణ: మంత్రి వివేక్
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు.. జర్మనీకి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలోని లోయర్ సాక్సనీ రాష్ట్రంతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, అంతర్జాతీయ కార్మిక ఉపాధిపై బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం న్యూఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయంలో తెలంగాణ, లోయర్ సాక్సనీ రాష్ట్రాల మధ్య టాలెంట్ మొబిలిటీ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రసంగించారు.
లోయర్ సాక్సనీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒలాఫ్ లీస్, భారతదేశంలోని జర్మనీ రాయబారి డా.జాస్పర్ వీక్, డా.బాల రమణితో పాటు భారత్, జర్మనీకి చెందిన పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పనకు సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ(టామ్‌కామ్) ప్రాంగణంలో లోయర్ సాక్సనీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామన్నారు. ఈ కార్యాలయం ద్వారా నైపుణ్య శిక్షణ, ఉద్యోగ నియామకాలు, ఇరు ప్రాంతాల సంస్థల మధ్య సమన్వయం సులభతరం అవుతుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలుకు సీఎం ఓవర్సీస్ విద్యాస్కాలర్‌షిప్ కింద రూ.50 కోట్లను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News