Share News

న్యూజిలాండ్‌కు పన్నుల్లేకుండా ఎగుమతులు

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:02 AM

భారత్‌- న్యూజిలాండ్‌ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మేరకు సరుకు రవాణా సోమవారం ప్రారంభమైంది.

న్యూజిలాండ్‌కు పన్నుల్లేకుండా ఎగుమతులు
Dandumalkapur Green Industrial Park

  • దండుమల్కాపూర్‌ ‘గ్రీన్‌’ పార్కు నుంచి ఆహార ఉత్పత్తుల తొలి రవాణా ప్రారంభం

యాదాద్రి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): భారత్‌- న్యూజిలాండ్‌ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మేరకు సరుకు రవాణా సోమవారం ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు నుంచి ఉత్పత్తుల కంటైనర్‌ను విదేశీ వాణిజ్య విభాగం తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కంటైనర్‌లో ఫ్రామర్‌ అగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తయారు చేస్తున్న బియ్యం, రవ్వ, అటుకులతో పాటు వ్యవసాయ ఆధారిత ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలకు ద్వారాలను తెరుస్తుందని అన్నారు.


దేశీయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించే దిశగా ఇది కీలక ముందడుగుగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో భారత్‌ నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతులపై సుంకాల భారం తొలగిపోనుందని తెలిపారు. ఇప్పటి వరకు వస్త్రాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులకు 10 శాతం, ఔషధాలు సహా ఇతర రంగాల ఉత్పత్తులకు గల 5 శాతం ఎగుమతి సుంకాలు ఉన్నాయని, ఇక నుంచి ఎలాంటి సుంకాలు లేకుండానే న్యూజిలాండ్‌కు ఎగుమతులు చేసే అవకాశం కలిగిందని చెప్పారు. ఈ ఎగుమతులతో భారతదేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతత్వం పెరగడంతోపాటు ఎగుమతుల విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మద్యం విక్రయాల జోరు.. దసరా నేపథ్యంలో ఫుల్‌ జోష్‌

కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మించండి

డిజిటల్‌ వేదికపై తాండూరు కందిపప్పు రైతులు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:02 AM