ఈవీ, ఆటోమొబైల్స్‌లో అపార అవకాశాలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:52 AM
ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్, ఎలక్ర్టిక్ మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ చార్జింగ్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి
గ్లోబల్ సమ్మిట్-26లో భాగస్వాములవ్వండి
పారిశ్రామిక వేత్తలకు మంత్రి పొన్నం పిలుపు
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్, ఎలక్ర్టిక్ మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ చార్జింగ్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు.. తమ పరిశ్రమలను మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ర్టిక్ వెహికల్స్ (ఈవీ) రంగాల తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం సచివాలయంలో బుధవారం మంత్రి పొన్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు 7 నుంచి 9 వరకు జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఆటోమొబైల్, ఈవీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితమే ఈవీ పాలసీని తీసుకొచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆటోమొబైల్, మొబిలిటీ రంగాల అభివృద్ధికి మూడు పారిశ్రామిక పార్కులు, మొబిలిటీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలున్నాయని, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్ సమ్మిట్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News