ఓపీఎస్ కోసం రేపు ఉద్యోగుల సామూహిక సెలవు
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:44 AM
పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) పునరుద్ధరణ కోసం కాంట్రీబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న సామూహిక సెలవు పెట్టనున్నారని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎ్‌ససీపీఎ్‌సఈయూ) అధ్యక్షుడు స్థితప్రజ్ఞ చెప్పారు.
1.50 లక్షల మందికి పైగా ఇప్పటికే దరఖాస్తు : స్థిత ప్రజ్ఞ
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) పునరుద్ధరణ కోసం కాంట్రీబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న సామూహిక సెలవు పెట్టనున్నారని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్ఈయూ) అధ్యక్షుడు స్థితప్రజ్ఞ చెప్పారు. మొత్తం 2.60 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అత్యవసర సేవలకు 45 వేల మందిని మినహాయించి.. మిగతా 2.15 లక్షల మంది సామూహిక సెలవులో పాల్గొంటారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పాటిస్తారన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ‘ధర్మ దీక్షలు’ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 1.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు ‘సామూహిక సెలవు’ కోసం దరఖాస్తులు ఇవ్వడం తమ ఉద్యమానికి లభిస్తున్న విశేష స్పందనకు నిదర్శనమన్నారు.
ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు దీనిలో పాల్గొనాలని స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ‘నవంబరు 17న సామూహిక సెలవు పాటిస్తాం’ అని కుండపోత వర్షం కురుస్తున్నా.. ఆగస్టు 23న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన జన జాగరణ సభ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వరి శ్రీకాంత్ సారథ్యంలోని ప్రతినిధి బృందం ఆదివారం అందజేసింది. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ.. మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఓపీఎస్’ పునరుద్ధరణ ఉద్యోగుల ప్రధాన ఆకాంక్షగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరే తెలంగాణ సర్కారు కూడా సీపీఎస్ రద్దుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని చెప్పారు. ‘ఒక సీపీఎస్ ఉద్యోగి తన వేతనంలో 11.5 శాతం ఆర్థిక భారం భరిస్తున్నా, పదవీ విరమణ తర్వాత గౌరవ ప్రదమైన పెన్షన్ లేదు. సరైన వైద్య భద్రత లేకపోవడం ఉద్యోగులకు జరుగుతున్న తీవ్ర అన్యాయం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ‘సామూహిక సెలవు’ ఉద్యమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితోపాటు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతునిచ్చాయి. నల్లగొండలో జరిగే ధర్మదీక్షలో స్వయంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రను ఒప్పించండి.. ప్రధానికి రేవంత్ వినతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News