Share News

అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:31 AM

ఉద్యోగుల హెల్త్‌ కార్డులు అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స
Revanth Reddy

  • హెల్త్‌ కార్డులపై పీఆర్టీయూ నేతలతో సీఎం

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల హెల్త్‌ కార్డులు అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 15లోపు సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రులతో ఒప్పందాలు జరిపిస్తామన్నారు. 2003 ఉపాధ్యాయులకు పాత పింఛను విధానం అమలయ్యేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ శ్రీపాల్‌ రెడ్డి బుధవారం సీఎంను సచివాలయంలో కలిశారు.


ఈ సందర్భంగా శ్రీపాల్‌ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించారు. పీఆర్సీ నివేదిక తెప్పించుకుని మంచి ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని కోరారు. పెండింగులో ఉన్న డీఏ, బిల్లులను చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ కార్యవర్గాన్ని అభినందించారు. ప్రధాన కార్యదర్శి బట్టాపురం మధుసూదన్‌ రెడ్డి, ప్రతినిధులు సుంకరి భిక్షం గౌడ్‌, సోమిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కండక్టర్‌ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు

స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్‌ ఎన్‌వోసీ!

7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:31 AM