Share News

ఈగల్‌ ఫోర్స్‌ సమాచారంతో అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:44 AM

తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ అందించిన సమాచారంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదించారు.

ఈగల్‌ ఫోర్స్‌ సమాచారంతో అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

  • నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ స్వాధీనం

హైదరాబాద్‌, నవంబర్‌ 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ అందించిన సమాచారంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదించారు. నాగ్‌పూర్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి రూ.1.75 కోట్ల విలువైన 1,470 గ్రాముల అనుమానిత మెథాంఫెటమైన్‌ (ఎండీ) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన షేక్‌ రఫీక్‌(48), అబ్దుల్‌ అరీఫ్‌ అలియాస్‌ చింటూ(24), ప్రతిక్‌ చంద్రకాంత్‌ కదమ్‌(31)లను అదుపులోకి తీసుకున్నారు.


వీరిలో ఒకరు కార్‌ డ్రైవర్‌ కాగా, మరొకరు దుస్తుల దుకాణంలో సేల్స్‌పర్సన్‌, మరొకరు అమెజాన్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌. వీరిపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జితు, రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌ విశ్వకర్మ అలియాస్‌ అక్కీ భాయ్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేవ‌స్‌లో పట్టుబడిన ఓ అనుమానిత సరఫరాదారు ఇచ్చిన సమాచారంతో నాగ్‌పూర్‌లోని డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ గుట్టు బయటపడింది. ఈ తనిఖీల్లో రూ.1,40,150 నగదుతో పాటు మొబైల్‌ ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ తూకం యంత్రాలు, ప్యాకింగ్‌ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:44 AM