Share News

తెలంగాణ ఆదాయంలో తగ్గిన కేంద్ర నిధుల వాటా

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:54 AM

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులు ఏటికేడాదీ బాగా తగ్గిపోతున్నాయి!

తెలంగాణ ఆదాయంలో తగ్గిన కేంద్ర నిధుల వాటా
CESS Report Telangana

  • పదేళ్లలో రూ.5,61,787కోట్లకు

  • పెరిగిన మొత్తం సమగ్ర రుణభారం

  • ‘సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌’ అధ్యయన నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులు ఏటికేడాదీ బాగా తగ్గిపోతున్నాయి! తెలంగాణ మొత్తం రాబడిలో కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 23.5 శాతం ఉండగా.. 2024-25 నాటికి అది 15.1 శాతానికి పడిపోయింది. ‘‘సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)’ ఆధ్వర్యంలో 2014 జూలై నుంచి 2025 మార్చి వరకూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జరిపిన సమగ్ర అధ్యయనంలో వెల్లడైందీ విషయం. ‘తెలంగాణ ప్రజా ఆర్థిక వ్యవస్థ: ధోరణులు, సవాళ్లు, విధానాల ప్రాధాన్యతలు’ పేరిట ఆ అధ్యయన నివేదికను బేగంపేట సెస్‌ ఆడిటోరియంలో విడుదల చేశారు.


సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రేవతి, విజయ్‌కుమార్‌, ఆర్బీఐ ప్రతినిధులు దేవీప్రసాద్‌ రత్‌, సంగీతాదాస్‌, రామ్మోహన్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చే వచ్చే నిధుల వాటా గణనీయంగా తగ్గిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణభారం.. 2025 మార్చి నాటికి రూ,3,89,941 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాతా బాధ్యతలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన హామీలు, బడ్జెటేతర రుణాలు వంటి వాటన్నింటిని కలిపితే మొత్తం రుణభారం రూ.5,61,787కోట్లకు ఎగబాకిందని వివరించారు.


వేలకోట్ల రూపాయలను వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేటాయిస్తున్నప్పటికి, ఆ ఖర్చు వల్ల క్షేత్రస్థాయిలో ఎంతమేరకు ఫలితాలు వస్తున్నాయన్నదానిపై స్పష్టమైన సమాచారాన్ని వెల్లడించట్లేదని ఈ నివేదికలో ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికంగా ఖర్చు పెట్టినప్పటికీ, ప్రయోజనం పెద్దగా లేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. రాష్ట్ర మూలధన వ్యయంలో సింహభాగాన్ని ఆ భారీ ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ కేవలం 50టీఎంసీల నీరుమాత్రమే ఇవ్వగలిగారని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 04:55 AM