Share News

డేటా సెంటర్ల హబ్‌గా తెలంగాణ

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:49 AM

డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న తెలంగాణలో కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క.. ప్రపంచస్థాయి ఎనర్జీ టెక్నాలజీ సంస్థ ‘ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌’కు సూచించారు.

డేటా సెంటర్ల హబ్‌గా తెలంగాణ

  • రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించండి

  • పారిస్‌లోని ‘ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌’కు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న తెలంగాణలో కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క.. ప్రపంచస్థాయి ఎనర్జీ టెక్నాలజీ సంస్థ ‘ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌’కు సూచించారు. పారిస్‌లోని ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కార్యాలయాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క.. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గ్వెనెల్‌ హుయెట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ‘డేటా సెంటర్ల అభివృద్దికి తెలంగాణ ప్రధాన కేంద్రం (హబ్‌)గా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుదీకరణ, డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌ రంగాల్లో మీ సంస్థకు భారీ అవకాశాలు ఉన్నాయి.


భవిష్యత్తులో సంస్థ మొత్తం ఆదాయంలో 30 శాతానికి పైగా డేటా సెంటర్ల వ్యాపారం నుంచే వచ్చే అవకాశాలు ఉన్నందున, వాటిని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో తయారీ సామర్థ్యాల విస్తరణకు ఇదే సరైన సమయమ’ని ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ప్రతినిధులను ఆహ్వానించారు. భారత్‌లో ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ సంస్థ కార్యకలాపాల్లో తెలంగాణ వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉందన్నారు. రాష్ట్రంలో సంస్థకు చెందిన తయారీ, పరిశోధన-అభివృద్ధి, విక్రయాలు తదితర విభాగాల్లో ఇప్పటికే 5వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థ తెలంగాణ యూనిట్‌ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన యూనిట్‌గా గుర్తింపు పొందడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి గర్వకారణమన్నారు. ఈ నెల 30న రాష్ట్రంలో సంస్థ నూతన యూనిట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. రాష్ట్రంతో సంస్థ సంబంధాలను బలోపేతం చేయడంలో సీఈవో, ఎండీ దీపక్‌ శర్మ కృషి ప్రశంసనీయమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 04:49 AM