12 నుంచి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:54 AM
రాష్ట్రవ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ఈనెల 12 నుంచి 18 వరకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు
సర్క్యులర్ జారీ చేసిన సెర్ప్ సీఈఓ
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ఈనెల 12 నుంచి 18 వరకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో సైతం మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం 19వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ మొత్తాన్ని జమచేసే విధంగా సంబంధిత విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా... కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అర్హులైన దరఖాస్తుదారుల పెండింగ్ వెరిఫికేషన్, ఆమోద ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సూచిస్తూ.. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సీఈఓ దివ్య దేవరాజన్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. సంబంధిత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులను ప్రొటోకాల్ ప్రకారం ఈ ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. చేయూత పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్న వారికి అభ్యంతరాలు, సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రతి కార్యక్రమ వేదిక వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News