Share News

రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అరకొరే

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:20 AM

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లలో ఏటేటా భారీ కోత పడుతోంది.

రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అరకొరే
Telangana Central Grants

  • నిధుల కోతతో తెలంగాణకు అన్యాయం..

  • పదేళ్లలో 12నుంచి 5శాతానికి పడి పోయిన కేంద్ర వాటా

  • 30.8 నుంచి 6.3 శాతానికి దిగజారిన జీఎస్‌టీ పరిహారం

  • ఆర్థిక సంఘాల నిధుల్లోనూ కోత: సెస్‌

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లలో ఏటేటా భారీ కోత పడుతోంది. చట్టబద్ధంగా దక్కాల్సిన కేంద్ర పన్నుల వాటా ఇంచుమించు సక్రమంగానే వస్తున్నప్పటికీ, వివిధ పథకాలు, పరిహారాల కింద ఇచ్చే సహాయక గ్రాంట్లు(గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌) గణనీయంగా తగ్గిపోతుండటం పట్ల ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌)’ ఇటీవల విడుదల చేసిన ‘పబ్లిక్‌ ఫైనాన్సెస్‌ ఆఫ్‌ తెలంగాణ... ట్రెండ్స్‌, చాలెంజెస్‌, పాలసీ ప్రయారిటీస్‌’ అనే నివేదికలో గ్రాంట్ల వివరాలను వెల్లడించింది.


తెలంగాణ మొత్తం రెవెన్యూ రాబడిలో కేంద్ర నుంచి వచ్చే నిధుల వాటా 2015-16లో 12ు ఉండగా... 2024-25 సంవత్సరం నాటికి అది 5 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ప్రతి బడ్జెట్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి గ్రాంట్లను ఆశిస్తోంది. అయితే, కేంద్ర ప్రాయోజిత పథకాలు(సీఎ్‌సఎస్‌), జీఎ్‌సటీ పరిహారాలు, రెవెన్యూ రాబడుల లోటు పరిహారాలు, చిన్న పిల్లల సంరక్షణ వంటి సహాయక గ్రాంట్లలో రాష్ట్రానికి మొండిచెయ్యే ఎదురవుతోంది. 2017-18 నుంచి కేంద్రం విడుదల చేస్తున్న ప్రధాన గ్రాంట్ల సరళిని పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. సీఎ్‌సఎస్‌ పథకాల కింద గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి 60: 40గా ఉండగా, ప్రస్తుతం అది 25: 75గా మారింది. సీఎ్‌సఎ్‌సల కింద 2017-18లో రూ.6,108 కోట్లు రాగా, 2021-22లో రూ.4,461 కోట్లు, 2024-25లో 5,303 కోట్లు అందాయి.


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రెవెన్యూ లోటు పరిహారం అందుతుండగా, తెలంగాణకు ఆ తరహా గ్రాంటు వర్తించడం లేదు. ఇక జీఎస్‌టీ పరిహారం గ్రాంటు 2022-23లో 30.8ు(రూ.4,062 కోట్లు) ఉండగా, 2023-24లో 6.3 శాతానికి రూ. 625 కోట్లు) తగ్గడం విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా సహాయక గ్రాంట్ల కింద 2020-21లో రూ.15,471 కోట్లు రాగా,2024-25 నాటికి అది సగానికి తగ్గి రూ.7,913 కోట్లకు చేరింది. అలాగే, 14, 15వ ఆర్థిక సంఘాల గ్రాంట్ల కింద 2019-20లో రాష్ట్రానికి రూ.3,219 కోట్లు రాగా, ఆ తర్వాతి సంవత్సరం రూ.3,135 కోట్లు అందాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి 2022-23లో రూ.3,423 కోట్లు, 2023-24లో రూ.2,924 కోట్లకు పరిమితమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనైతే అత్యంత దారుణంగా రూ.1,589 కోట్లు మాత్రమే విడుదల కావడంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.


రైతు భరోసా కింద తగ్గిన నిధుల వ్యయం

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నిక్కచ్చి నిబంధనలతో రైతు భరోసా పథకం కింద నిధుల వ్యయం తగ్గినట్లు ‘సెస్‌’ నివేదిక విశ్లేషించింది. సాగులో లేని భూములు, అనర్హులను తొలగించడం ద్వారా ఈ ఆదా సాధ్యమైందని తెలిపింది. 2023-24లో దీని కింద రూ.13,576 కోట్లుగా ఉన్న ఈ పథక వ్యయం 2024-25నాటికి రూ.7,481 కోట్లకు తగ్గిందని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 06:18 AM