ప్రతీ కమతానికి భూధార్ ఇస్తాం
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:35 AM
రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి శాటిలైట్ సర్వే నిర్వహించి భూములను క్రమబద్ధీకరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
శాటిలైట్ సర్వేతో భూముల క్రమబద్ధీకరణ
రూ.40వేల కోట్లతో 8లక్షల ఇళ్లు నిర్మించాం: పొంగులేటి
షాద్‌నగర్/నందిగామ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా శాటిలైట్ సర్వే నిర్వహించి.. భూములను క్రమబద్ధీకరిస్తాం. పట్టాదార్ పాస్ బుక్‌లో నక్ష మ్యాప్‌ను జతచేసి ప్రతీ కమతానికి భూధార్ నంబర్ ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు రూ.40 వేల కోట్లతో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చాం’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో రూ. కోటితో నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనం, హైమాస్ట్ లైట్లను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
అలాగే మండల తహసీల్దార్ కార్యాలయం, డ్వాక్రా భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ దొరల పాలనలో రూ.8.23లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ అప్పులకు ప్రతీనెల రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తూనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకువచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూ భారతి చట్టం తీసుకువచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతీ జిల్లాలో మొదటి విడతలో 70 గ్రామాలను సర్వే చేయించామని తెలిపారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10,486 గ్రామాల్లో సర్వే చేయిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News