Share News

బీసీ స్టడీ సర్కిళ్లలో అభ్యర్థుల స్టయిఫండ్‌ పెంపు: మంత్రి పొన్నం

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:08 AM

వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు 12 బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులకిచ్చే స్టయిఫండ్‌ పెంచినట్లు బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో అభ్యర్థుల స్టయిఫండ్‌ పెంపు: మంత్రి పొన్నం
Ponnam Prabhakar

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు 12 బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న యువతీ యువకులకిచ్చే స్టయిఫండ్‌ పెంచినట్లు బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన యవతకు నెలవారీ స్టయిఫండ్‌ రూ.5,000 నుంచి రూ.7,000కు.., బుక్‌ ఫండ్‌ రూ.5,000 నుంచి రూ.10 వేలకు పెంచినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రూప్స్‌, బ్యాంకింగ్‌ సర్వీసు, రైల్వే రిక్రూట్‌మెంట్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీఎస్‌పీసీ) నిర్వహించే ఫౌండేషన్‌ కోర్సుల శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతకు నెలవారీ స్టయిఫండ్‌ నెలకు రూ. 1000 నుంచి రూ. 1500కు పెంచామన్న మంత్రి పొన్నం.. ఈ నెల నుంచి ఇది వర్తిస్తుందన్నారు.


సివిల్స్‌ కోసం గత రెండేళ్లలో ఉచిత శిక్షణ పొందిన పూర్వ అభ్యర్థులు మరింత పటిష్ఠంగా ప్రిపేరయ్యేలా తాజా అభ్యర్థులతో సమానంగా స్టయిఫండ్‌ ఇచ్చి మళ్లీ ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. సిద్దిపేట డిపో మేనేజరు శుక్రవారం కుర్చీలో కూర్చుని, కార్మికులు నేలపై కూర్చుని మాట్లాడుతున్నట్లు జరిగిన ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి.. సంబంధిత డిపో మేనేజరు వ్యవహారశైలిపై అధికారుల వద్ద ఆరా తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 05:08 AM