Share News

బీసీ ఆత్మగౌరవ భవనాలకు 88 కోట్లు విడుదల

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:57 AM

రాష్ట్రంలోని 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది.

బీసీ ఆత్మగౌరవ భవనాలకు 88 కోట్లు విడుదల
Ponnam Prabhakar

  • ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తికావాలి: పొన్నం

రాష్ట్రంలోని 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆయా కుల సంఘాల ప్రతినిధులకు జీవో పత్రాలను అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు, ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాల మేరకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు ఉన్న పరిపాలనా, సాంకేతిక అవరోధాలను హెచ్‌ఎండీఏ సహకారంతో పరిష్కరించామని తెలిపారు. లే అవుట్లను ‘రెడీ టూ కన్‌స్ట్రక్షన్‌’ విధానంలో సిద్ధం చేసినందున, కుల సంఘాలు ఆలస్యం చేయకుండా కార్తిక మాసంలోనే శంకుస్థాపనలు చేసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:57 AM