వ్యవసాయ మార్కెట్లలో ‘ఏఐ విప్లవం’!
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:53 AM
రాష్ట్రంలోని మార్కెట్ యార్డు వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో అనుసంధానించి, దేశానికే ఆదర్శంగా నిలిచే డిజిటల్ మార్కెట్ యార్డులుగా మార్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
దేశానికే ఆదర్శంగా డిజిటల్ మార్కెట్ యార్డులు
ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత: తుమ్మల
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మార్కెట్ యార్డు వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో అనుసంధానించి, దేశానికే ఆదర్శంగా నిలిచే డిజిటల్ మార్కెట్ యార్డులుగా మార్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతు పండించిన పంటకు సరైన ధర అందించడంతో పాటు మార్కెట్ యార్డు క్రయవిక్రయాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఈ డిజిటల్ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఐటీ శాఖతో సమన్వయం చేసుకుని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను వారం రోజుల్లోగా ఆహ్వానించాలని ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... రైతు తన పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చినప్పటి నుంచి విక్రయం ముగించుకుని, నగదు చెల్లింపులు పొంది బయటకు వెళ్లే వరకు ప్రతి దశను ఒకే డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రైతు వివరాల నమోదు, ప్రతి పంట లాట్‌కు ప్రత్యేక ఐడీ కేటాయింపు, డిజిటల్ బిడ్డింగ్, టెండర్ నమోదు, పంట నాణ్యత పరీక్ష, ఆన్‌లైన్ వేలం, ధర నిర్ణయం, పంట తూకం, అమ్మకపు బిల్లుల తయారీ, మార్కెట్ ఛార్జీల లెక్కింపు, గేట్ ఎగ్జిట్ పాస్‌లు, రసీదులు, ఈ-పర్మిట్ల జారీ వరకు అన్ని ఒకే వేదికపై జరగాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న కోహెడ ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేసి, వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి దశ పనులను పూర్తిచేయాలని తుమ్మల అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News