ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లోలక్ష మందికి శిక్షణ
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:47 AM
రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
టాస్క్ సహకారంతో నిర్వహణ: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై, కళాశాలలు, విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ‘తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనీషియేటివ్’లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సోమవారం సచివాలయంలో టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్), ఏడబ్ల్యూఎస్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ తదితర ఇండస్ట్రీ ఓరియెంటెడ్ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రత్యక్షంగా ప్రాక్టికల్స్ చేసేందుకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ తదితర నాన్ స్టెమ్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి ‘ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్’ ద్వారా 900 కంటే ఎక్కువ డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షల కోసం డిస్కౌంట్ వోచర్లను అందిస్తామన్నారు.
ఆర్థిక ప్రగతి కేంద్రాలుగా జిల్లాలు
స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సప్లయ్ చెయిన్‌తో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామని, ప్రతి జిల్లాను ఆర్థిక ప్రగతి కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త అద్వర్యంలో సోమవారం టీహబ్‌లో నిర్వహించిన ‘మెగా ఎఫ్‌టీఏ’ రాష్ట్రస్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల నూతన వాణిజ్య అవకాశాలు తలుపు తడుతున్నాయన్నారు. వీటిని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులు... ముఖ్యంగా ఎంఎ్‌సఎంఈలకు మార్గనిర్దేశం చేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News