Share News

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక వెబ్‌సైట్.. త్వరలో ప్రారంభం

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:15 PM

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో గుర్తింపు కమిటీ సమావేశమైంది.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక వెబ్‌సైట్.. త్వరలో ప్రారంభం
Ponnam Prabhakar

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. ఈరోజు (శనివారం) మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో గుర్తింపు కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఇప్పటివరకు చేపట్టిన గుర్తింపు ప్రక్రియపై సమీక్ష జరిపారు. యూనివర్సిటీలు, కళాకారులు, సబ్బండ వర్గాలతో ఇప్పటికే జరిపిన సంప్రదింపులపై చర్చించారు. గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.


Ponnam Prabhakar

ఉద్యమకారుల గుర్తింపు కోసం రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. వెబ్‌సైట్‌ను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. వెబ్‌సైట్ ప్రారంభ గడువును ఖరారు చేసే అంశంపై సమావేశంలో చర్చించారు. వెబ్‌సైట్ పురోగతిపై సమీక్షించేందుకు కమిటీ త్వరలో మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించింది. వెబ్‌సైట్ ప్రారంభ తేదీతో పాటు.. తదుపరి కార్యాచరణపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

హుజురాబాద్‌లో ఒక్క కొత్త పింఛను ఇచ్చినా రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. పెయింట్ షాప్‌లో ఎగిసిపడ్డ మంటలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 04:32 PM