Share News

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. పెయింట్ షాప్‌లో ఎగిసిపడ్డ మంటలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 03:06 PM

హైదరాబాద్‌లోని మియాపూర్ న్యూ హఫీజ్‌‌పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెయింట్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మొదటి, రెండో అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. పెయింట్ షాప్‌లో ఎగిసిపడ్డ మంటలు
Miyapur Fire Accident

హైదరాబాద్, నవంబర్ 21: నగరంలోని మియాపూర్ న్యూ హఫీజ్‌‌పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెయింట్ షాప్‌లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. క్రమంలో రెండో అంతస్తులోకి వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షాపులో కెమికల్ పెయింట్‌లు ఉండటంతో పెద్దఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


ప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. రెండు అంతస్తుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని ఫైర్ సిబ్బంది గుర్తించారు. షాపు నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇబ్రహీంపట్నంలో దారుణం.. మూడు రోజుల క్రితం కాళ్లు, తాజాగా మనిషి తల లభ్యం

హుజురాబాద్‌లో ఒక్క కొత్త పింఛను ఇచ్చినా రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 03:28 PM