Share News

ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు బంగారు భవిత

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:55 AM

సాంకేతికవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు బంగారు భవిత

  • 2500 కోట్లతో 65 ఐటీఐలు ఏటీసీ సెంటర్లుగా మార్పు

  • సాంకేతిక విద్యకు త్వరలో భారీగా నిధులు : శ్రీధర్‌బాబు

షాద్‌నగర్‌, షాద్‌నగర్‌ రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సాంకేతికవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 65 ఐటీఐ కళాశాలలను రూ.2500 కోట్లతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మార్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.


ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌మండలం లింగారెడ్డిగూడలో రూ.30 కోట్లతో నిర్మించనున్న నూతన కళాశాల భవనం, బూర్గు ల గ్రామంలో 10కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ భవన నిర్మాణాలకు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాంకేతిక విద్య బలోపేతానికి భారీగానిధులు కేటాయించబోతున్నామని పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలను ఆధునికీకరించి విద్యార్థులను పరిశ్రమలకు తగిన నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నారు. కేవలం సర్టిఫికెట్లు అందించడమే కాకుండా విద్యార్థులకు ఉపాధి కల్పించడమే ప్రధానలక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 04:56 AM