కరువు నివారణకు రూ.30వేల కోట్ల సాయం కోరతాం
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:59 AM
తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరువు నివారణ కోసం కేంద్రం రూ.30 వేల కోట్ల సహాయం అందించాలని కోరతామనిబీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రధాని మోదీకి లేఖ రాస్తాం: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరువు నివారణ కోసం కేంద్రం రూ.30 వేల కోట్ల సహాయం అందించాలని కోరతామని, ఈ మేరకు త్వరలోనే ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు ఆజ్మత్ హుస్సేన్, సంపత్ కుమార్‌లతో కలిసి ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు, కరువు మండలాల ప్రకటన నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూపొందించిన ప్రణాళికల ప్రకారం దాదాపు రూ.30వేల కోట్ల నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి, రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రధానికి లేఖ రాయాలని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News