రాష్ట్రంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:01 AM
రవాణా శాఖతో మారుతీ సుజుకీ ఒప్పందండ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పారదర్శకత, పరీక్షల్లో కచ్చితత్వం పెంపునకు తెలంగాణ రవాణా శాఖ చర్యలు తీసుకుంది.
రవాణా శాఖతో మారుతీ సుజుకీ ఒప్పందండ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పారదర్శకత, పరీక్షల్లో కచ్చితత్వం పెంపునకు తెలంగాణ రవాణా శాఖ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఏర్పాటుకు మారుతీ సుజుకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖతో ఒప్పందం చేసుకున్న మారుతీ సుజుకీ.. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో 12 టెస్ట్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, మేడ్చల్, నాగోల్‌తోపాటు కరీంనగర్‌లో ఈ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో ప్రాంతంలో రెండు చొప్పున మొత్తం 12 ట్రాక్‌లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News