Share News

సింగరేణి కార్మికులకు దీపావళి కానుక

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:05 AM

దసరా పండుగకు ముందే సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. కార్మికుల శ్రమకు గుర్తింపుగా ఏటా ఇచ్చే దీపావళి బోన్‌సను ఆదివారం ప్రకటించింది.

సింగరేణి కార్మికులకు దీపావళి కానుక
Singareni Diwali bonus 2026

  • రూ.1,10,250 బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం

  • గత ఏడాది కంటే రూ.5,250లు అదనం

కొత్తగూడెం టౌన్‌, భూపాలపల్లి టౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగకు ముందే సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. కార్మికుల శ్రమకు గుర్తింపుగా ఏటా ఇచ్చే దీపావళి బోన్‌సను ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు శనివారం కోల్‌కతాలో కోల్‌ఇండియా యాజమాన్యం, సింగరేణి కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి. ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో పండుగలు సమీపిస్తున్న వేళ కార్మిక కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


దేశవ్యాప్తంగా కోల్‌ఇండియాలో పనిచేస్తున్న 1,96,753 మంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులకు ఈ బోనస్‌ అందనుంది. 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2026 మార్చి 30 మధ్య రిటైరైన మాజీ ఉద్యోగులకు కూడా రూ.8,351 బోనస్‌ అందించనుంది. గతేడాది దీపావళి బోన్‌సగా రూ.1,05,000లు ఇవ్వగా.. ఈసారి మరో రూ.5 వేలు పెంచిన యాజమాన్యం రూ.1,10,250లుగా ప్రకటించడం గమనార్హం. ఈ సమావేశంలో సింగరేణి యాజమాన్యం ప్రతినిధులు, పలువురు జీఎంలు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...
జీసీసీ మెరుపుల వెనుక ఒత్తిళ్లెన్నో!

ఏఐ.. రెండో టీచర్‌!

ఒకే ఆస్తి.. ఒకే బిల్లు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవిత్రవాణి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 05:05 AM