అరుదైన ఖనిజాలపై కలిసి పనిచేద్దాం
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:11 AM
అరుదైనఖనిజాలను వెలికితీయటంలో అమెరికన్ సంస్థలతో కలిసి పనిచేయడానికి సింగరేణి సంస్థ సిద్ధంగా ఉందని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు.
అమెరికన్ సంస్థలతో భాగస్వామ్యానికి సిద్ధం: సింగరేణి
అరుదైనఖనిజాలను వెలికితీయటంలో అమెరికన్ సంస్థలతో కలిసి పనిచేయడానికి సింగరేణి సంస్థ సిద్ధంగా ఉందని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు చెందిన పొలిటికల్, ఎకనామిక్ విభాగం అధిపతి మెరెడిత్ మెజ్లర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల బృందం సింగరేణి భవన్‌లో బుద్ధప్రకాశ్ జ్యోతితో శుక్రవారం సమావేశమైంది.
మైనింగ్ సాంకేతికత, ఉమ్మడి భాగస్వామ్యం తదితర అంశాలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. మైనింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులు, సాంకేతికత, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని సింగరేణి కోరుతోందని బుద్ధప్రకాశ్ తెలిపారు. అమెరికన్ బృందం స్పందిస్తూ.. తమ దేశంలో అరుదైన ఖనిజ రంగంలో ఉన్న సంస్థలతో కలిసి పనిచేయటానికి అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News