Share News

సింగరేణిలో 1,135 మంది..జనరల్‌ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:14 AM

సింగరేణి కాలరీస్‌ సంస్థలో బదిలీ వర్కర్‌ లేదా జనరల్‌ అసిస్టెంట్‌ ట్రైనీలుగా పనిచేస్తున్న 1,135 మందిని జనరల్‌ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరిస్తూ సంస్థయాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

సింగరేణిలో 1,135 మంది..జనరల్‌ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ
Singareni Workers

సింగరేణి కాలరీస్‌ సంస్థలో బదిలీ వర్కర్‌ లేదా జనరల్‌ అసిస్టెంట్‌ ట్రైనీలుగా పనిచేస్తున్న 1,135 మందిని జనరల్‌ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరిస్తూ సంస్థయాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా రెండుమూడేళ్లుగా క్రమబద్ధీకరణ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి దీపావళి పండుగ ముందే యాజమాన్యం తీపి కబురు చెప్పింది. 2025 డిసెంబరు 31వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరి బదిలీ వర్కర్‌ లేదా జనరల్‌ అసిస్టెంట్‌ ట్రైనీలుగా పని చేస్తున్న కార్మికులకు ఈ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వర్తిస్తాయి. 2025 డిసెంబరు 31వ తేదీకి ముందు ఏ క్యాలండర్‌ సంవత్సరంలోనైనా సరే భూగర్భ విభాగంలో పనిచేసిన వారైతే 190 పని దినాలు, ఓపెన్‌ కాస్ట్‌ గనులు లేదా బయట విభాగాల్లో పనిచేసిన వారైతే 240 పని దినాలు పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ క్రమబద్ధీకరణ ప్రయోజనం కలుగుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:14 AM