Share News

సింగరేణిలో 5 గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:27 AM

ఉత్తమ మైనింగ్‌ పద్ధతుల అమలు, పర్యావరణ హిత చర్యలు, కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ... 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 5 బొగ్గు గనులకు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను సాధించి మరోసారి ఘనతను చాటుకుంది.

సింగరేణిలో 5 గనులకు  ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌
SCCL Awards 2024-25

  • కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న సీఎండీ

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ మైనింగ్‌ పద్ధతుల అమలు, పర్యావరణ హిత చర్యలు, కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ... 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 5 బొగ్గు గనులకు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను సాధించి మరోసారి ఘనతను చాటుకుంది. ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్‌ చంద్ర దూబే చేతుల మీదుగా సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాష్‌ ఈ అవార్డులను అందుకున్నారు.


ప్రతిష్ఠాత్మక ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ అవార్డులను అందుకున్న గనుల్లో శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్‌కేఎన్‌టీ, ఆర్‌కే-6 ఇంక్లేన్‌, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్‌ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరీగూఢ ఓసీ, రామగుండం-3కి చెందిన ఆర్‌జీఓసీ-1 గనులు ఉన్నాయి. కాగా, తెలంగాణ జెన్‌కోకు చెందిన తాడిచర్ల-1 ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనికి 2024-25 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన 5-స్టార్‌ రేటింగ్‌ లభించింది. 2020-21, 2023-24లో కూడా ఈ గనికి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లభించడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ మెట్రోకు రూ.275 కోట్లు

ట్రూ-అప్‌ భారం ప్రజలపైనే..

నేడు అతి భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:27 AM