Share News

నయా భారత్‌ కాదు.. మోదీ నకిలీ నయా ఇండియా

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:37 AM

మీడియాను అణచివేయడం, ప్రశ్నించే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం ‘నకిలీ నయా ఇండియా’లో భాగమని ప్రముఖ పాత్రికేయుడు సిద్ధార్థ వరదరాజన్‌ వ్యాఖ్యానించారు. నయా ఇండియా పేరుతో సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొత్త విధానాలను మోదీ సర్కారు ..

నయా భారత్‌ కాదు.. మోదీ నకిలీ నయా ఇండియా
Siddharth Varadarajan

  • ఓటమి భయంతోనే బీజేపీ వ్యతిరేకుల ఓట్ల తొలగింపు

  • మీడియాపై అణచివేత.. జర్నలిస్టులపై అక్రమ కేసులు

  • ప్రముఖ పాత్రికేయుడు సిద్ధార్థ వరదరాజన్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు26 (ఆంధ్రజ్యోతి): మీడియాను అణచివేయడం, ప్రశ్నించే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం ‘నకిలీ నయా ఇండియా’లో భాగమని ప్రముఖ పాత్రికేయుడు సిద్ధార్థ వరదరాజన్‌ వ్యాఖ్యానించారు. నయా ఇండియా పేరుతో సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొత్త విధానాలను మోదీ సర్కారు ప్రజల మీద రుద్దుతోందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ బలం 140కి, తర్వాత 40కి తగ్గిపోతుందన్న భయంతోనే.. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు.


శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌ వేదికగా జరిగిన ‘ది వైర్‌’ సదస్సులో సిద్ధార్థ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ‘న్యూ అజెండా ఫర్‌ న్యూ ఇండియా’ అంశంపై మాట్లాడారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ అని నినాదాలిచ్చే సర్కారు పాలనలో దేశ రాజధానిలో మహిళలకు రక్షణలేదని ధ్వజమెత్తారు. ప్రజల ఓటుహక్కును లాక్కోవడం, నిరసనలను అణచివేయడం, మీడియాను భయపెట్టడం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం... ఇదంతా నకిలీ నయా ఇండియాలో భాగమేనని అన్నారు. ‘‘మెరుగైన వేతనాల కోసం ఉద్యమించిన నోయిడా కార్మికులపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించి.. అలహాబాద్‌ హైకోర్టు నుంచి తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న నోయిడా కలెక్టర్‌ మేధారూపం, స్వయనా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ కుమార్తె. ఈకేసు సుప్రీం బెంచ్‌ ముందుకు అప్పీల్‌కు వెళ్లింది.


ఆ బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి కుమారుడు ఎలక్షన్‌ కమిషన్‌కు కౌన్సిల్‌ (న్యాయవాది)గా వ్యవహరిస్తున్నారు. చట్టాల దుర్వినియోగానికి, హక్కుల హననానికి ఇదొక పరాకాష్ట’’ అని వరదరాజన్‌ వ్యాఖ్యానించారు. మైనారిటీలు, బలహీనవర్గాలపై దాడులు సర్వసాధారణంగా మారాయని ఎస్‌ఎ్‌ఫఐ జాతీ య నాయకురాలు అయిషీ ఘోష్‌ అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు కొడాలి శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జ్ఞానే్‌షకుమార్‌ రాజీనామా చేయకపోతే అక్టోబరు 2న దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు దిగుతామని సీజేపీ అధికార ప్రతినిధి విజయ్‌ మల్లంగి వెల్లడించారు. ది తెలుగు వైర్‌ ఎడిటర్‌ కొండూరి వీరయ్య, పవన్‌, కాపు శ్రీనివాస్‌, ఐవీ రమణరావు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, పరకాల ప్రభాకర్‌, కె.రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్‌ హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి:
చిట్టీల గురువు.. 10 కోట్లతో ఉడాయింపు!

పెరుగుతున్న గోదావరి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 04:40 AM