Share News

సికింద్రాబాద్‌లో నకిలీ కరెన్సీ పట్టివేత

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:06 AM

సులువుగా డబ్బు సంపాదన మార్గం ఎంచుకున్న వ్యక్తికి.. పాత నేరస్తుడు తోడయ్యాడు.. ఇద్దరూ రాజస్థాన్‌ వాసులే. డబ్బు సంపాదన కోసం ఎదురు చూస్తున్న బికనీర్‌ జిల్లా వాసి శివరతన్‌ మాహియా (19)కి కొన్ని నెలల క్రితం ఓం ప్రకాశ్‌ పరిచయం అయ్యాడు.

సికింద్రాబాద్‌లో నకిలీ కరెన్సీ పట్టివేత
Fake Currency

  • ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ తనిఖీలు

  • ఒకరి అరెస్టు.. పరారీలో మరో నిందితుడు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సులువుగా డబ్బు సంపాదన మార్గం ఎంచుకున్న వ్యక్తికి.. పాత నేరస్తుడు తోడయ్యాడు.. ఇద్దరూ రాజస్థాన్‌ వాసులే. డబ్బు సంపాదన కోసం ఎదురు చూస్తున్న బికనీర్‌ జిల్లా వాసి శివరతన్‌ మాహియా (19)కి కొన్ని నెలల క్రితం ఓం ప్రకాశ్‌ పరిచయం అయ్యాడు. గతంలో పలు కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన ఓం ప్రకాశ్‌.. తనకు పరిచయమైన శివరతన్‌ మాహియాతో జైపూర్‌ నుంచి ముంబైకి రూ.60లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తీసుకెళితే రూ.2.20 లక్షలిస్తానని నమ్మించాడు. దీంతో ఓం ప్రకాశ్‌ చెప్పినట్లు మైసూర్‌ ఎక్స్‌ప్రె్‌సలో అక్టోబరు 28అర్థరాత్రి కాచిగూడకు చేరుకున్న శివరతన్‌.. ‘కే ఇన్‌’ హోటల్‌లో బస చేశాడు. మరునాడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.


వరదల వల్ల సికింద్రాబాద్‌ నుంచి వెళ్లాల్సిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దవడంతో అక్కడే ఉండిపోయాడు. ముంబైకి వెళ్లడానికి శివరతన్‌ అక్టోబరు 31న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. రోజువారీగా 10వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రె్‌సలో జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌, బాంబు డిటెక్షన్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా తనిఖీ చేస్తుండగా జనరల్‌ కోచ్‌లో శివరతన్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు సంగతి బయట పడింది. నిందితుడి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన నకిలీ నోట్లతోపాటు ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్‌ డీఎస్పీ జావీద్‌, ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ ఆదివారం మీడియాకు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 06:06 AM