Share News

వెంటవెంటనే రెండు రోడ్డు ప్రమాదాలు.. నలుగురికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:36 PM

ఒకే సమయంలో రెండు సార్లు రోడ్డు ప్రమాదం సంభవించడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు సమీపంలో చోటుచేసుకుంది.

వెంటవెంటనే రెండు రోడ్డు ప్రమాదాలు.. నలుగురికి తీవ్ర గాయాలు
double road accident in sangareddy

సంగారెడ్డి, నవంబర్ 11: రోడ్డుపై అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డిలో చోటుచేసుకున్న ఓ ప్రమాదం హెచ్చరిస్తుంది. ఒకే సమయంలో రెండు సార్లు రోడ్డు ప్రమాదం సంభవించడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి.. ఆయన సొంత కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..


పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్ఆర్ రహదారిపై వెళ్తున్న ఓ కారును.. కొల్లూరు సమీపంలో లారీ ఢీకొట్టింది. కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా.. వారికి స్వల్ప గాయాలయ్యాయి. భయబ్రాంతులకు గురైన వారు.. కారు నుంచి కిందకు దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తోన్న మరో కారు.. ఆ నలుగురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో.. ఆ రోడ్డు గుండా ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ క్షతగాత్రులను గమనించి.. తన సొంత వాహనంలో నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

‘డబ్బులకు ఆశపడకుండా ఓటేయండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు

సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 04:34 PM