Share News

భారీ లావాదేవీలపై నిఘా పెట్టాలి.. సైబర్ నేరాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

ABN , Publish Date - Nov 09 , 2026 | 05:56 PM

ఏఐ ఆధారిత సైబర్ దాడుల నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు జారీ చేశారు.

భారీ లావాదేవీలపై నిఘా పెట్టాలి.. సైబర్ నేరాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక
sajjanar on ai cyber attack

హైదరాబాద్, నవంబర్ 9: నగరంలో ఏఐ ఆధారిత సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు జారీ చేశారు.


‘నగరంలో ఏఐ ఆధారిత సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో.. బ్యాంకులు, క్విక్ కామర్స్, మొబిలిటీ సంస్థలు, సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. థర్డ్ పార్టీ మాడ్యూళ్లు, ఏపీఐ సేవలకు కూడా పటిష్ఠమైన భద్రత కల్పించుకోవాలి. పాత సాఫ్ట్‌వేర్లు, భద్రతా లోపాలు, కస్టమర్ పోర్టళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఏఐ ఏజెంట్ల సాయంతో నెట్‌వర్క్ లోపాలను గుర్తించి మ్యూల్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలను హ్యాకర్లు మళ్లిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా.. వినియోగంలో లేని పాత ఏపీఐలను తొలగించి, సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. భారీ లావాదేవీలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలి. కేవైసీ తనిఖీలను తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతితోనే చేయాలి’ అని సీపీ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు

For More TG News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 06:20 PM