Share News

వ్యవసాయ కమిషన్‌ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:45 AM

ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన సమయంలో వ్యవసాయ రంగానికి అందించిన చేయూత, జరిగిన అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ రూపొందించిన పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

వ్యవసాయ కమిషన్‌ ప్రచురించిన  పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌
Revanth Reddy

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన సమయంలో వ్యవసాయ రంగానికి అందించిన చేయూత, జరిగిన అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ రూపొందించిన పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, సభ్యులు భవానీరెడ్డి, కేవీఎన్‌ రెడ్డిలు పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.


కాగా వ్యవసాయ రంగానికి సేవలందించిన శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రైతులను వ్యవసాయ కమిషన్‌ ‘కృషి రత్న’ అవార్డులకు ఎంపిక చేసింది. సీఎం చేతుల మీదుగా డాక్టర్‌ సుగుణాకర్‌రెడ్డి, డాక్టర్‌ ఎస్‌డీ శిఖామణి, దిలీ్‌పరెడ్డి, లోనావత్‌ శాంతాబాయి, కె.లావణ్యలకు పురస్కారాలు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 05:45 AM