Share News

కేటీఆర్‌కు వణుకు మొదలైంది

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:28 AM

తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులే తప్ప కేసీఆర్‌ కాదని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ అన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చామని కేటీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ ఎక్కడ తలకాయ పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.

కేటీఆర్‌కు వణుకు మొదలైంది
Addanki Dayakar

  • సిరిసిల్లపై సీఎం మొదటి అడుగు..

  • తర్వాత సిద్దిపేట, గజ్వేల్‌పైనే: అద్దంకి

  • కేటీఆర్‌.. సిరిసిల్లలో నీ బండారం

  • బయటపెడతాం: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులే తప్ప కేసీఆర్‌ కాదని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ అన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చామని కేటీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ ఎక్కడ తలకాయ పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండేది కాదని ఎద్దేవా చేశారు. ఆదివారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ అంటే తామేనని విర్రవీగిన కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి పాతాళానికి తొక్కారని విమర్శించారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి మొదటి అడుగు సిరిసిల్లపై, రెండో అడుగు సిద్దిపేటపై, మూడో అడుగు గజ్వేల్‌పై వేయబోతున్నారన్నారు.


కేటీఆర్‌ను వణికిస్తామని, కేసీఆర్‌ ఫాంహౌస్‌ కారిడార్‌ను పూర్తిగా బద్దలుకొట్టడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌.. ఫ్యూచర్‌ సిటీ గురించి మాట్లాడటం మానేసి, ముందు తన ఫ్యూచర్‌ ఏంటో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ తలపెట్టిన సిరిసిల్ల సభ కేటీఆర్‌ను కంగారుపెడుతోందని, అందుకే ఆయన సీఎంకు కంగాళీ లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో సీఎం అడుగుపెడితే తన బండారం బయటపడుతుందని కేటీఆర్‌ భయపడుతున్నారన్నారు. ఇన్నేళ్లు సిరిసిల్లను ఏలిన కేటీఆర్‌.. నేతన్నలకు రూ.300 కోట్ల బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. ఈ నెల 30న జరిగే సభలో కేటీఆర్‌ మోసాల లెక్కలు బయటపెడతామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చేతులెత్తేసిన కొత్త కాంట్రాక్టర్‌?!

పామాయిల్‌ గెలల కొను‘గోల్‌మాల్‌’!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 06:28 AM