భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు: సీఎం రేవంత్
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:55 PM
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారంకాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి తొలి అడుగు పడనుందన్నారు
హైదరాబాద్, జూన్ 10: భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభంకానుంది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి తొలి అడుగు పడనుందన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) ప్రధాన కార్యాలయం ప్రారంభంకానున్నట్లు తెలిపారు. కేవలం 6 నెలల్లోనే రికార్డు సమయంలో FCDA భవనం పూర్తైందన్నారు.
ఆధునిక భారత్‌కు నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ఉండనుందని సీఎం తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రణాళిక, సాంకేతికత, సుస్థిర అభివృద్ధికి ప్రతీకగా ఫ్యూచర్ సిటీ మారబోతోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రూ.20 కోట్లతో 15 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో FCDA భవన నిర్మాణం జరిగింది. ప్రారంభానికి ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి నెట్ జీరో భవనంగా FCDA గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
భారతీరాజా మృతికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
మాతృభూమి గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు
Read Latest Telangana News And Telugu News