Share News

అందుకే గడ్డం పెంచుతున్నారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

ABN , Publish Date - Nov 09 , 2026 | 08:46 PM

‘నాకు గడ్డం ఉందని.. కేటీఆర్ కూడా గడ్డం పెంచుతున్నారు. నాలా గడ్డం పెంచినంత మాత్రాన కేటీఆర్.. ఎప్పటికీ రేవంత్ కాలేరు’ అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు కొడంగల్ రైతుల ఆత్మీయ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. కేటీఆర్‌ గడ్డంపై సెటైర్లు వేశారు.

అందుకే గడ్డం పెంచుతున్నారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
revanth reddy on ktr beard

హైదరాబాద్, నవంబర్ 9: కొడంగల్ రైతుల ఆత్మీయసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘విదేశీ కన్సల్టెంట్‌ను పెట్టుకుని.. కేటీఆర్ నాకు పోటీగా మారాలనుకుంటున్నారు. నా మాదిరిగా గడ్డం పెంచుకోవాలని కేటీఆర్‌కు సలహా ఇచ్చారట. అందుకని కేటీఆర్ కూడా గడ్డం పెంచుకున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది కేటీఆర్ తీరు. ఎన్ని వేషాలు వేసినా.. పులి పులే.. నక్క నక్కే. కేటీఆర్ ఎన్ని జన్మలెత్తినా రేవంత్‌రెడ్డి కాలేరు. నాలాగా మారాలంటే గుండె ధైర్యం కావాలి. కార్యకర్తలకు అండగా నిలవాలి. నమ్మినవాళ్లను ముంచే కేటీఆర్ ఎప్పుడూ రేవంత్‌ కాలేరు. కేటీఆర్‌కు గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టింది.. బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో!?’ అంటూ సీఎం ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. యువకుడి అరెస్ట్

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 08:47 PM