Share News

తెలంగాణ ఉద్యమకారుడు లింగాల కేదారి కుటుంబానికి అండగా సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:25 PM

తెలంగాణ ఉద్యమకారులను మరచిపోమని, వారికి అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాటను నిలబెట్టుకున్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు లింగాల కేదారి కుటుంబానికి అండగా సీఎం రేవంత్
cm revanth granted 10 lakhs under cmrf

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ ఉద్యమకారులను మరచిపోమని, వారికి అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు తెలంగాణ మలిదశ ఉద్యమానికి తమవంతూ పాటుపడిన హనుమకొండ దివంగత దంపతుల కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు.


హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత దంపతులు హన్మకొండలో ఒక సాధారణ హోటల్ నడుపుతూ.. జీవనం సాగించేవారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా అల్పాహరం, భోజనం, టీ, కాఫీ అందించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ.. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకునేవారు. ఈ మేరకు నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రధాని ప్రసంశలు అందుకున్నారు.


కాగా.. ఈ నెల(సెప్టెంబర్) 9న హోటల్ వద్ద ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో కేదారి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య పుష్పలత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు 10వ తేదీన మృతిచెందారు. ఈ విషాదఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి సీఎమ్ రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత దంపతులు అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 09:46 PM