సర్‌లో కాంగ్రెస్ ఓట్లు తొలగించే కుట్ర!
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:27 AM
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
సర్‌లో కాంగ్రెస్ ఓట్లు తొలగించే కుట్ర!
బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పన్నాగం
మహారాష్ట్ర, బెంగాల్, బిహార్‌లలో ఓట్ల చోరీతోనే విజయం సాధించారు
దొంగ దెబ్బతీస్తామంటే ఊరుకోం
బీజేపీయేతర రాష్ట్రాలను టార్గెట్ చేశారు
కొడంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకోవడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు: సీఎం రేవంత్‌రెడ్డి
కొడంగల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పన్నాగం పన్నుతున్నాయని పేర్కొన్నారు. గతంలో రెండు, మూడు శాతం ఓట్ల తేడాతోనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియలో పది శాతం ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ శ్రేణులు ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని సూచించారు. కాంగ్రె్‌సను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్న బీఆర్‌ఎస్, బీజేపీలను బొంద పెట్టాలన్నారు. కొడంగల్ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి శనివారం అక్కడ తన నివాసంలో కాంగ్రెస్ బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ‘సర్’ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.
ఓట్ల చోరీతోనే ఆ రాష్ట్రాల్లో గెలుపు
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర, బిహార్, బెంగాల్‌లలో ఓట్ల చోరీతోనే గెలిచిందన్నారు. తెలంగాణలోనూ ఎలాగైనా గెలవాలని ‘సర్’ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఓట్ల తొలగింపునకు కుట్రపన్నారని ఆరోపించారు. ఇలా దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. గతంలో ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐలను ప్రయోగించేవారని.. ఇప్పుడు ‘సర్’ పేరిట తడిగుడ్డతో గొంతు కోస్తున్నారని విమర్శించారు. చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సిరిసిల్ల, సిద్దిపేటపై దండయాత్ర
దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో
Read Latest AP News And Telangana News And International News And Telugu News
ఈ వార్తలు కూడా చదవండి:
దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో
Read Latest AP News And Telangana News And International News And Telugu News