Share News

టీవీ9 షేర్ల బదిలీ కేసులో రవిప్రకాశ్‌కు సుప్రీంలో నిరాశ

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:16 AM

టీవీ9(అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ పైవ్రేట్‌ లిమిటెడ్‌-ఏబీసీపీఎల్‌) మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ మిగిలింది. ఆయనపై నమోదైన ఫోర్జరీ, తదితర క్రిమినల్‌ కేసుల ఉపసంహరణకు కోర్టు నిరాకరించింది.

టీవీ9 షేర్ల బదిలీ కేసులో  రవిప్రకాశ్‌కు సుప్రీంలో నిరాశ
Ravi Prakash

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): టీవీ9(అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ పైవ్రేట్‌ లిమిటెడ్‌-ఏబీసీపీఎల్‌) మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ మిగిలింది. ఆయనపై నమోదైన ఫోర్జరీ, తదితర క్రిమినల్‌ కేసుల ఉపసంహరణకు కోర్టు నిరాకరించింది. ఏబీసీపీఎల్‌ షేర్లను అలందా మీడియా కొనుగోలు చేసింది. అయితే, యాజమాన్య మార్పులను అడ్డుకోవాలనే దురుద్దేశంతో రవిప్రకాశ్‌తోపాటు మరికొందరు కుట్ర పన్నారని అలందా మీడియా పోలీసులను ఆశ్రయించింది. పాత తేదీలతో నకిలీ షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని సృష్టించారని ఫిర్యాదులో ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 321 కింద కేసును ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా కింది కోర్టులో దరఖాస్తు చేసి అనుమతి పొందింది. దీనిని సవాల్‌ చేస్తూ అలందా మీడియా హైకోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ఉత్తర్వులను రవిప్రకాశ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ల ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. రవిప్రకాశ్‌ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదంటూ హైకోర్టు తీర్పునే సమర్థించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఘట్‌కేసర్‌-కాజీపేట మధ్య నాలుగో లైన్‌
తాతా మధు, నవీన్‌రెడ్డిపై మండలి ఎథిక్స్‌ కమిటీ విచారణ షురూ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 06:30 AM