ఘట్‌కేసర్-కాజీపేట మధ్య నాలుగో లైన్
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:00 AM
రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గం సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)- కాజీపేట సెక్షన్‌లో నాలుగో లైన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాడి-సికింద్రాబాద్- కాజీపేట మార్గంలో ఉన్న ఈ ట్రాక్‌పై ప్రస్తుతం మూడు లైన్లు ఉన్నా.. వాటి సామర్థ్యాన్ని మించి 120 శాతం మేర రైల్వే ట్రాఫిక్ ఉంటోంది.
2,419 కోట్లతో రైల్వేమార్గం విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఏపీలో రేణిగుంట-అరక్కోణం మధ్య అదనంగా రెండు లైన్లు
విస్తరణతో రైళ్ల సమయపాలన మెరుగుపడుతుంది: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గం సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)- కాజీపేట సెక్షన్‌లో నాలుగో లైన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాడి-సికింద్రాబాద్- కాజీపేట మార్గంలో ఉన్న ఈ ట్రాక్‌పై ప్రస్తుతం మూడు లైన్లు ఉన్నా.. వాటి సామర్థ్యాన్ని మించి 120 శాతం మేర రైల్వే ట్రాఫిక్ ఉంటోంది. ఇది మరింతగా పెరుగుతుండటంతో ఘట్‌కేసర్-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల పొడవున నాలుగో లైన్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ మార్గంలో 17 ప్రధాన వంతెనలు, 151 చిన్న వంతెనలను నిర్మించాల్సి ఉంటుంది. రూ.2,419 కోట్లతో నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట-అరక్కోణం మార్గంలో రూ.1,936 కోట్లతో రెండు అదనపు (3వ, 4వ) లైన్ల నిర్మాణానికి కూడా కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. 77 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈ లైన్లను మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించారు. కాగా, బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 8 కీలక రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ఈ వివరాలను రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే సామర్థ్యం పెంపు, రద్దీ తగ్గింపు లక్ష్యంగా 8 హై-డెన్సిటీ రైల్వే కారిడార్లను నాలుగు లైన్లుగా మార్చుతున్నామని తెలిపారు. దేశంలో మొత్తం రైల్వే ట్రాఫిక్‌లో 40శాతం మేర ఈ మార్గాలపైనే ఉందని తెలిపారు. సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో నాలుగో లైన్‌కు క్యాబినెట్ ఆమోదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీనితో రైల్వే ట్రాఫిక్ తగ్గడంతోపాటు రైళ్ల సమయపాలన మెరుగుపడుతుందని పేర్కొన్నారు. విజయవాడ, ముంబై మార్గాల్లో మెరుగైన రైలు ప్రయాణాలు సాగించడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రైల్వే బడ్జెట్ కేటాయింపులు 21 రెట్లు పెరిగాయని, గత 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ. 36,286 కోట్లను కేటాయించిందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూసీ ప్రాజెక్టుకు.. దసరా ముహూర్తం!
తాతా మధు, నవీన్‌రెడ్డిపై మండలి ఎథిక్స్ కమిటీ విచారణ షురూ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News