Share News

వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

ABN , Publish Date - Apr 24 , 2026 | 10:22 PM

పట్టణంలోని ఓ ప్రముఖ దేవాల యంలో దాతలు చేయించిన దాదాపు 5వెండి ఆభరణాలు కనిపించకుండా పోయి నట్లు తెలుస్తోంది.

       వెండి ఆభరణాలు ఏమయ్యాయి?

నందికొట్కూరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఓ ప్రముఖ దేవాల యంలో దాతలు చేయించిన దాదాపు 5వెండి ఆభరణాలు కనిపించకుండా పోయి నట్లు తెలుస్తోంది. దేవాలయానికి సంబంధించిన ఆదాయం మొత్తం గతంలో ఈవో గా ఉన్న అధికారి ఖర్చుల రూపంలో చూపించి బ్యాంకు బ్యాలెన్స లేకుండా చేశారు. ఆ దేవాలయానికి ఏడాదికి సుమారు రూ.20లక్షల ఆదాయం వచ్చేది. ఇలా ఐదు సం వత్సరాలు ఆదాయం బ్యాంకు బ్యాలెన్స లేకుండా ఆలయం మరమ్మతులకు వినియో గించినట్లు ఆలయ కమిటీ సభ్యులకు లెక్కలు చూపించారు. ఈవిషయమై కమిటీ సభ్యులకు ఆ ఈవోకు మధ్య గొడవ సాగింది. ఆఈవోపై ఉమ్మడి జిల్లాలో గతంలో పని చేసిన వివిధ దేవాలయాలకు చెందిన కమిటీ సభ్యులు కమిషనర్‌కు ఫిర్యాదులు చేయడంతో విధుల నుంచి తొలగించారు. సస్పెన్షనలో ఉన్న ఆయనను, ఆ తర్వాత విధులు నిర్వహించిన అధికారిని ఇద్దరిని ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారి వెండి ఆభరణాల లెక్కలు చూపించాలని పిలిపించారు. ఈ లెక్కల్లో దాదాపు 5 కేజీల వెండి వస్తువులు మాయం అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆలయానికి రావాల్సిన ఆదా యాన్ని ఆ అధికారి తిన్నట్లు కమిటీ సభ్యుల ముందు ఒప్పుకొని మొదట రూ.70లక్షలు ఇస్తానని, రెండోసారి రూ.40లక్షలు మాత్రమే ఇస్తానని రాజీ చేసుకు న్నారు. ఇదిలా ఉండగా స్వామికి దాతలు చేయించిన వెండి ఆభరణాలు కనిపిం చకుండా పోయిన విషయాన్ని గుట్టుగా ఉంచడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 24 , 2026 | 10:22 PM