బీజేపీలో చేరడంపై స్పందించిన మల్లారెడ్డి కోడలు ప్రీతి
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:31 PM
సామూహిక వందేమాతర గీతాలాపన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానించినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24: గత కొంతకాలంగా మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలకు కోడలు ప్రీతి రెడ్డి(Preethi Reddy) చెక్ పెట్టారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం ప్రీతి రెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రీతి మాట్లాడుతూ.. తాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో టచ్‌లో ఉన్నది వాస్తవమే అని అన్నారు. అయితే బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సామూహిక వందేమాతర గీతాలాపన కోసం మోదీని కలిసి ఆహ్వానించినట్లు చెప్పారు. మోదీ వస్తే పెద్ద ఈవెంట్ అవుతుందన్నారు. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ కార్యాలయంలో చంద్ర శేఖర్ తివారీని కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. ‘మా మామ మల్లారెడ్డి బీఆర్ఎస్‌లోనే ఉంటారు’ అంటూ ప్రీతి రెడ్డి తేల్చిచెప్పారు.
ఇటీవల కుటుంబసభ్యులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మల్లారెడ్డి కలిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా బీజేపీ కార్యాలయానికి ప్రీతి రెడ్డి రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రధానిని ఎందుకు కలిశారో చెప్పి.. ఈ ప్రచారానికి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
ఇవి కూడా చదవండి...
ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: బండి సంజయ్
రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం
Read Latest Telangana News And Telugu News