ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను ఖండిస్తున్నాం: మంత్రి పొన్నం
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:14 AM
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటు హక్కును కాపాడేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటు హక్కును కాపాడేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి ఓటర్ల హక్కులకు రక్షణ కల్పించాలన్నారు. ఓటు దొంగతనం జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిరసనకారులపై చేపడుతున్న నిర్బంధ చర్యలను తక్షణమే నిలిపివేయాలన్నారు.
విమానంలో అరెస్టు చేయడానికి యువకులు ఉగ్రవాదులా?
పోలీసులు విమానంలోకి దూరి యువకులను అరెస్టు చేయడానికి వారేమైనా ఉగ్రవాదులా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. నిరసనల్లో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తదితరులను విమానంలోనే అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎక్కడికక్కడ ఆరెస్టులు చేయడం ఎమర్జెన్సీని మించి తలపిస్తోందని కూనంనేని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రపతితో భేటీ తర్వాతా.. రాహుల్ పచ్చి అబద్ధాలు చెప్పారు
రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ అక్రమాలు: కేటీఆర్
‘హ్యాండ్, ఫుట్, మౌత్’ డిసీజ్ పంజా
Read Latest AP News And Telangana News And International News And Telugu News