అలా చేస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటారా? కేటీఆర్‌కు పొంగులేటి సవాల్
ABN , Publish Date - May 27 , 2026 | 05:21 PM
ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
హైదరాబాద్, మే27: ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే ఎక్కువ కడితేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని పేర్కొన్నారు. మీకంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే.. మీరు పోటీకి దూరంగా ఉంటారా? అంటూ కేటీఆర్‌ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు.
వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు నిరూపించానా.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ట్విట్టర్ వేదికా స్పందించారు. మే 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో గ్రామాల్లోకి వెళ్లి ఆ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని కేటీఆర్‌కు ఆయన స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుందంటూ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి చురకలంటించారు.
అలాగే జూన్ 1వ తేదీన మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని కేటీఆర్‌కు పొంగులేటి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్‌కు పొంగులేటి స్పష్టం చేశారు. దాంతో మీరు ప్రత్యేకంగా రాజకీయ సన్యానం తీసుకోనక్కర్లేదంటూ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి వ్యంగ్యంగా అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More TG News And Telugu News