Share News

పెట్రోల్‌ బంకు నుంచి మామూళ్ల వసూలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:07 AM

పెట్రోల్‌ బంకులో అంతా సజావుగా ఉందనే క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి తూనికలు కొలతల శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్‌ లంచం డిమాండ్‌ చేసి ప్రైవేటు వ్యక్తి ద్వారా వసూలు చేయించడంతో వారిద్దర్నీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

పెట్రోల్‌ బంకు నుంచి మామూళ్ల వసూలు
Petrol Pump Bribery

  • తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ప్రైవేటు వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌, యాదాద్రి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌ బంకులో అంతా సజావుగా ఉందనే క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి తూనికలు కొలతల శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్‌ లంచం డిమాండ్‌ చేసి ప్రైవేటు వ్యక్తి ద్వారా వసూలు చేయించడంతో వారిద్దర్నీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్‌ బంకులో ఇటీవల తనిఖీ చేసి వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తానని చెప్పి బంకులోని డైలీ సేల్స్‌ రిజిస్టర్‌ను తనతో తీసుకువెళ్లారు.


సర్టిఫికెట్‌, రిజిస్టర్‌ ఇవ్వాలంటే తనకు రూ.20 వేలు ఇవ్వాలని వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశాడు. తన తరఫున ప్రైవేటు వ్యక్తి అయిన కాసారం రవీందర్‌కు ఆ డబ్బు ఇవ్వాలని సూచించాడు. రవీందర్‌ అదే పెట్రోల్‌ బంక్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తుండటం గమనార్హం. వెంకటేశ్వర్లు మామూళ్ల డి మాండ్‌ ప్రతి నెలా ఎక్కువ కావడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు ట్రాప్‌ సిద్ధం చేసి ఎల్‌బీనగర్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటున్న రవీందర్‌ను పట్టుకున్నారు. ఇందులో తన వాటాగా రూ.5 వేలు వస్తాయని, రూ.15 వేలు వెంకటేశ్వర్లుకు ఇవ్వాల్సి ఉంటుందని రవీందర్‌ స్పష్టం చేయడంతో వారిద్దర్నీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:07 AM