Share News

13 లక్షల కోట్ల నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా..?!

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:49 AM

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులపై బీజేపీఎల్పీ ఉప నేత పాయల్‌ శంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

13 లక్షల కోట్ల నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా..?!

  • సీఎం రేవంత్‌ రెడ్డికి పాయల్‌శంకర్‌ సవాల్‌

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులపై బీజేపీఎల్పీ ఉప నేత పాయల్‌ శంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 13 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన రూ.13 లక్షల కోట్ల నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. కేంద్రం ఇచ్చిన రూ.13 లక్షల కోట్ల నిధులు ఏ పద్దు కింద, ఏ జీవో కింద విడుదల చేసిందో లెక్కలతో సహా వివరించడానికి సిద్ధమని మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు.


కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని ఒప్పించి బహిరంగ చర్చకు తీసుకొస్తామన్నారు. కరీంనగర్‌ లోక్‌సభా నియోజకవర్గ అభివృద్ధికి బండి సంజయ్‌ తీసుకు వచ్చిన రూ.వేల కోట్ల నిధుల లెక్కలూ కాంగ్రెస్‌ నేతలకు చెబుతామన్నారు. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పర్యటనకు ప్రజల స్వచ్ఛంద స్పందన చూసిన కాంగ్రెస్‌ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. ఢిల్లీకెళ్లి కేంద్ర మంత్రులను కలిసి తమ పనులు చక్కబెట్టుకుంటున్న సీఎం.. బయటికొచ్చాక.. కేంద్రంపై రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదని మండి పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:49 AM