Share News

ఎన్నికల పారదర్శకతే ప్రజాస్వామ్యానికి పునాది: పర్ణికా రెడ్డి

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:04 AM

ఎన్నికల పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి ప్రాథమిక పునాది అని నారాయణపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్లే అయినప్పటికీ, యువతరం ఆశలు, ఆకాంక్షల కోణంలో ఈ అంశాన్ని చూస్తున్నానని తెలిపారు.

ఎన్నికల పారదర్శకతే ప్రజాస్వామ్యానికి పునాది:  పర్ణికా రెడ్డి
Parnika Reddy

  • ‘ఎలక్టోరల్‌ ఇంటిగ్రిటి’ అంశంపై ప్రసంగం

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి ప్రాథమిక పునాది అని నారాయణపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్లే అయినప్పటికీ, యువతరం ఆశలు, ఆకాంక్షల కోణంలో ఈ అంశాన్ని చూస్తున్నానని తెలిపారు. నిర్వహించిన ‘ఎలక్టోరల్‌ ఇంటిగ్రిటి’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. తెలంగాణలో సుమారు 3.87 కోట్ల జనాభా ఉండగా, 73 లక్షల ఓట్లపై ప్రశ్నలు తలెత్తడం, పేర్లు తొలగించటం ఆందోళన కలిగిస్తోందన్నారు.


నారాయణపేట నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల మంది ఓటర్లు ఉండగా, 40 వేల ఓట్లు తొలగించారని, మరో 50 వేల నుంచి 60 వేల ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. పారదర్శక హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సర్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ఆరోపించారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారా ఇన్‌చార్జి సిరివెల్ల ప్రసాద్‌ మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియ పూర్తిగా సుపరిపాలన, ఎన్నికల ప్రక్రియపై దాడి చేసేలా ఉందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 05:04 AM