Share News

ఓయూలో భోజన నాణ్యతపై విద్యార్థినుల ఆందోళన

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:51 AM

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని లేడీస్‌ హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

ఓయూలో భోజన నాణ్యతపై విద్యార్థినుల ఆందోళన
OU students protest

  • అన్నం, కూరల గిన్నెలతో రోడ్డుపై నిరసన

ఉస్మానియా యూనివర్సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని లేడీస్‌ హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఎంబీఏ, లా, నిజాం కళాశాలలకు చెందిన వంద మంది విద్యార్థినులు సోమవారం రాత్రి వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వండిన అన్నం, కూరలను రోడ్డుపై పెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.


నాణ్యత లేని ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని తెలిపారు. వంటకాల తయారీలో నాణ్యమైన సరుకులు వినియోగించాలని, కూరల నాణ్యతను మెరుగుపరిచి సరిపడా భోజనం అందించాలని కోరారు. ఓయూ డివిజన్‌ ఏసీపీ జి. జగన్‌ విద్యార్థినులకు సర్ది చెప్పారు. మంగళవారం సాయంత్రం వైస్‌ చాన్స్‌లర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను నేరుగా వివరించే అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 04:51 AM